calender_icon.png 26 April, 2025 | 5:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమే.. బీఆర్‌ఎస్ విజయం

26-04-2025 12:00:00 AM

 గజ్వేల్, ఏప్రిల్ 25: ఏడాదిన్నర కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ప్రజలకు పనికొచ్చే పని ఏ ఒక్కటి చేయలేద ని, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమే బిఆర్‌ఎస్ పార్టీ విజయమని ఉమ్మడి మెదక్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ రెడ్డి, మాజీ ఎఫ్డిసి చైర్మన్ గజ్వేల్ నియోజకవర్గ బిఆర్‌ఎస్  పార్టీ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డిలు అన్నారు. శుక్రవారం గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వారు విలేకరులతో మాట్లాడారు. కెసిఆర్ పాలనలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని, కాంగ్రెస్ ప్రభుత్వ పాలన మొదలైన నాటి నుండి ఏ ఒక్కరు సంతోషంగా లేరని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఏ ఒక్క హామీని  వారు పూర్తిగా అమలు చేయలేదని ఆరోపించారు.

మెదక్ ఉమ్మడి జిల్లా నుండి లక్ష మందికి పైగా ముఖ్య నాయకులు, కార్యకర్తలు తరలి రానుండగా, గజ్వేల్ నుంచి 17వేల మంది వరంగల్ సభకు తరలిరానున్నట్టు గజ్వేల్ నియోజకవర్గ బిఆర్‌ఎస్  ఇంచార్జ్  ప్రతాప్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో  సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధి మాత్రమే కనబడుతుందన్నారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ కంచి రాజమౌళి, వైస్ చైర్మన్ జక్కియుద్దిన్, మాజీ ఆత్మ కమిటీ చైర్మన్  కృష్ణారెడ్డి, మాజీ ఏఎంసి చైర్మన్  శ్రీనివాస్, పిఎసిఎస్ చైర్మన్ జేజేల వెంకటేశం గౌడ్, పట్టణ పార్టీ అధ్యక్షుడు నవాజ్ మీరా, మాజీ కౌన్సిలర్లు గోపాల్ రెడ్డి,రజిత,రహీం  నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.