calender_icon.png 19 April, 2025 | 4:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి

15-04-2025 12:00:00 AM

తెలంగాణ అడ్వకేట్ జేఏసీ కన్వీనర్ పులి గారి గోవర్ధన్ రెడ్డి

ముషీరాబాద్, ఏప్రిల్ 14 (విజయక్రాంతి): అంబేద్కర్ ఆశయాలను నెరవేర్చినప్పుడే ఆయనకు మనం ఇ చ్చే ఘనమైన నివాళి అని తెలంగాణ అడ్వకేట్ జేఏసీ కన్వీనర్ పులి గారి గోవర్ధన్ రెడ్డి అన్నారు. ఈ మేరకు సోమవారం ప్రపంచ మేధావి, భార త రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బి.ఆ ర్ అంబేద్కర్ జయంతి సందర్బంగా సోమవారం లోయర్ ట్యాంక్ బండ్ లోని అంబెడ్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా పులిగారి గోవర్ధన్ రెడ్డీ మాట్లాడుతూ  జ్ఞానం మానవ జీవితానికి పునాది అని చాటి చెప్పిన మహనీయుడు బాబా సాహెబ్ అంబేద్కర్ అని అ యన కొనియాడారు. అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.

బీజేపీ నేతల ఘన నివాళి 

వారాసిగూడ, ఏప్రిల్14: వారాసిగూడలో స్థానిక బీజేపీ నేతలు అం బేద్కర్‌కు ఘన నివాళులు అర్పించారు. వారాసిగూడ ప్రధాన రోడ్డు లో అంబేద్కర్ పటానికి పూల మా లలు వేసి జై జైలు పలికారు. అంబేద్కర్ గొప్ప దార్శనికుడని చెప్పారు బౌద్ధనగర్ బీజేపీ అధ్యక్షుడు సాయి ప్రసాద్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సుబ్బారావు సం పత్ కుమార్ సుధాకర్ పాల్గొన్నారు.

మలక్‌పేటలో

మలక్‌పేట, ఏప్రిల్ 14: విశ్వరత్న  డాక్టర్ బి.ఆర్  అంబేద్కర్ గారి 134 వ జయంతి ఉత్సవాలు ఘనంగా ఎం.జీ.బీ.ఎస్ బస్టాండ్ లో హమాలీల సంఘం అధ్యక్షుడు కారింగల మారుతి ఆధ్వర్యంలో ఘనంగా జరిగినది . ఈ కార్యక్రమానికి ముఖ్య అ తిథిగా టీఎస్‌ఆర్టీసీ లాజిస్టిక్ సి.ఐ న రేష్ కుమార్ విచ్చేశారు.  ఈ కార్యక్రమంలో  జగన్, సుజాత, సంతోష్, హమాలీలు, లాజిస్టిక్  ఉద్యోగస్తులు పాల్గొన్నారు.