calender_icon.png 6 March, 2025 | 10:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి

06-03-2025 12:00:00 AM

ఏఐటీయూసీ నాయకులు 

మందమర్రి మార్చి 5 (విజయక్రాంతి): ఏరియాలో విధులు నిర్వహిస్తున్న సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని గుర్తింపు సంఘం ఏఐటియుసి బ్రాంచ్ కార్యదర్శి సలేంద్ర సత్యనారాయణ, ఏరియా ఉపాధ్యక్షులు భీమనాధుని  సుదర్శన్ లు  స్పష్టం చేశారు. ఏరియాలోని సివిల్ డిపార్ట్మెంట్లో బుధవారం నిర్వహించిన గేట్ మీటింగ్‌లో వారు కార్మికులనుద్దేశించి మాట్లాడారు. ఏరియాలోని కార్మిక కాలనీలలో అంతర్గత రోడ్లు యాజమాన్యంతో మాట్లాడి పరిష్కరించామని, కాలనీలలో క్వాటర్ల మధ్యలో ఉన్న డ్రైనేజీ వ్యవస్థ ను తక్షణమే పరీక్షరిస్తామని యాజమాన్యం హామీ ఇచ్చిందని వారు స్పష్టం చేశారు.

కార్మిక సంక్షేమం కోసం యాజమాన్యంతో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తామన్నా రు. సివిల్ డిపార్ట్మెంట్ కార్మికుల ప్రమోషన్ లను   మార్చి తర్వాత ఇస్తామని యాజమాన్యం హామీ ఇవ్వడం జరిగిందని అన్నారు.. అదేవిధంగా కాంట్రాక్ట్ కార్మికుల కు హై పవర్ వేతనాలు అమలు అంశాన్ని సీ అండ్ ఎండి బలరాం దృష్టికి  తీసుకెళ్లగా ఆయన సానుకూలంగా స్పందిస్తూ  పరిష్కరిస్తామని అన్నారు. అదేవిధంగా కాంటాక్ట్ కార్మికు డు ఒకరోజు విదులకు రాకుం టే వేతనం కట్ చేసే పద్ధతిని మానుకోవాలని కోరగా పరిష్క రిస్తామని హామీ ఇచ్చినట్లు వారు వివరించారు. 

బ్రాంచ్ జాయింట్ సెక్రెటరీ కంది శ్రీని వాస్, బ్రాంచ్ సహకార్యదర్శి సోమిశెట్టి రాజేశం, ట్రేడ్స్మెన్ నాయకుడు టేకుమట్ల తిరుపతి, ఏరియా నాయకుడు ఆంటోని దినేష్, వర్క్ మెన్  ఇన్స్పెక్టర్ ములకలపల్లి వెంకటేశ్వర్లు, పిట్ కార్య దర్శులు కలవల శ్రీనివాస్, మర్రి కుమార్, సిహెచ్పి శర్మ, ఓదేలు, పారిపెల్లి సంజీవ్, సివిల్ డిపార్ట్మెంట్ నాయకులు వెంకటేశ్వర్లు, రాజేందర్‌లు తదితరులు పాల్గొన్నారు.