calender_icon.png 23 April, 2025 | 10:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి

23-04-2025 12:00:00 AM

ఘనంగా ప్రపంచ ధరిత్రి దినోత్సవం

ఆక్స్‌ఫోర్డ్ గ్రామర్ స్కూల్ చీప్ పాట్రన్, డెక్కన్ హెరిటేజ్ అకాడమిక్ ట్రస్ట్ చైర్మన్ ఎం.వేద కుమార్

ముషీరాబాద్, ఏప్రిల్ 22 (విజయక్రాంతి) : పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆక్స్‌ఫోర్డ్ గ్రామర్ స్కూల్ చీప్ పాట్రన్, డెక్కన్ హెరిటేజ్ అకాడమిక్ ట్రస్ట్ (డీహెచ్‌ఏటీ ) చైర్మన్ ఎం.వేద కుమార్ అన్నారు. పర్యావరణ నిర్వహణ పట్ల నిబద్ధతను ప్రదర్శించేలా ప్రపంచ ధరిత్రి దినోత్సవాన్ని మంగళవారం హిమాయత్ నగర్లోని ఆక్స్‌ఫోర్డ్ గ్రామర్ స్కూల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆక్స్‌ఫోర్డ్ గ్రామర్ స్కూల్ చీఫ్ పాట్రన్, డెక్కన్ హెరిటేజ్ అకడమిక్ ట్రస్ట్ (డీహెచ్‌ఏటీ) ఛైర్మన్ ఎం.వేదకుమార్ హాజరై పాఠశాల ప్రాంగణంలో మొక్కను నాటారు. ప్లాస్టిక్ ఫ్రీ జోన్’ హోదాను నొక్కి చెప్పారు.  ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ కట్టా ప్రభాకర్, డీన్ రామాంజుల, సీబీఎస్‌ఈ ప్రిన్సిపాల్ రేఖా రావు, ప్రీ-ప్రైమరీ ప్రిన్సిపాల్ ఫాతిమా ఖాజిమ్ తదితరులు పాల్గొన్నారు.