ప్రారంభించిన ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య
యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 20 (విజయక్రాంతి): ప్రముఖ పుణ్యక్షేత్రం యాద గిరిగుట్ట లక్ష్మీనర సింహ స్వామి ఆలయ సన్నిధిలో భక్తులు స్వామివారికి విరాళాలు, కాను కలు సమర్పించడానికి ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాన్ని ఆదివారం ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ప్రారంభించారు. ఈ కేంద్రంలో దాతల నుంచి విరాళాలు సేకరించడమే కాకుండా వారికి ప్రత్యేక సేవలను అందజేయనున్నారు. ఈ సందర్భంగా ప్రభు త్వ విప్ అయిలయ్య స్వామివారి విమాన గోపుర స్వర్ణతాపడం కోసం రూ.1,00,116 విరాళాన్ని ఆలయ ఈవో ఏ భాస్కర్‌రావుకు అందజేశారు. అదే విధం గా దేవస్థానం ఉద్యోగులు తమ ఒక్కరోజు వేతనం రూ.5,30,000 చెక్‌ను స్వామివారి నిత్యాన్నదాన ప్రసాద పథకానికి విరాళంగా అం దించారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిఖ ధర్మకర్త బీ నర్సింహమూర్తి, ఆలయ ఈఈ జే దయాకర్‌రెడ్డి పాల్గొన్నారు.