ఢిల్లీలో బీజేపీ మ్యానిఫెస్టో విడుదల
న్యూఢిల్లీ, జనవరి 17: తాము అధికారంలోకి వస్తే గర్భిణులకు రూ.21 వేల ఆర్థిక సాయం, గ్యాస్ సిలిండర్‌పై రూ.500 రాయి తీ ఇస్తామని, హోలీ, దీపావళి పండుగ సమయాల్లో ఉచితంగా సిలిండర్ అందిస్తామని బీజేపీ ప్రకటించింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ‘సంకల్ప పత్రా పేరిట శుక్రవారం పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పార్టీ మ్యానిఫెస్టోను విడుదల చేశారు. ‘మహిళా సమృద్ధి యోజన’లో భాగంగా ఒక్కో మహిళకు నెలకు రూ.25,00 చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని ఆయన ప్రకటించారు. ‘అటల్ క్యాంటీన్ల’ ద్వారా రూ.5కే భోజన పథకం అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఆయుష్మాన్ భారత్ పథకంలో భాగంగా ప్రతి కుటుంబానికి అదనంగా మరో రూ.5 లక్షల వరకు ఆరోగ్యబీమా కల్పిస్తామని వెల్లడించారు.