28-02-2025 12:00:00 AM
మహారాష్ట్రలో బీజేపీ బలం మరింత పెంచే దిశగా ఫడ్నవీస్ అడుగులు
మిత్రపక్ష మంత్రుల నిర్ణయాలపై నజర్
ముంబై, ఫిబ్రవరి 27: భవిష్యత్తులో ఏ పార్టీ మద్దతు తీసుకోకుండా బీజేపీని సొంతంగా అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా మహారాష్ట్ర సీఎం దేవేం ద్ర ఫడ్నవీస్ ముందుకు వెళ్తున్నట్టు తెలుస్తుంది. మొన్నటికి మొన్న నిస్సంకోచం గా ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని మహాయుతి ప్రభుత్వం ఆమోదం తెలిపిన రూ.900 కోట్లకు సంబంధించిన ప్రాజెక్టును తాత్కాలికంగా నిలిపివేయడంతో పాటు ఆ ప్రాజెక్ట్‌పై ఫడ్నవీస్ విచారణకు కూడా ఆదేశించారు.
అయితే సీఎం ఫడ్నవీస్ కేవలం షిండే నేతృత్వంలోని శి వసేన నుంచి క్యాబినెట్‌లో చోటు దక్కించుకున్న మంత్రులు తీసుకున్న నిర్ణయా లపై మాత్రమే కాకుం డా అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ నుంచి మంత్రివర్గంలో చో టు దక్కించుకున్న మంత్రుల నిర్ణయాలపై కూడా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుం ది. ఓ విద్యాసంస్థకు మైనారిటీ హోదా కట్టబెడుతూ ఎన్సీపీ మంత్రి జా రీ చేసిన ఆదేశాలను నిలిపివేస్తూ సీఎం గతవారం నిర్ణయం తీసుకున్నారు.
ప్ర మాణాలు పూర్తిస్థాయిలో పాటించనప్పటికీ సదరు విద్యాసంస్థకు మైనార్టీ హో దా కట్టబడుతూ తీసుకున్న నిర్ణయంపై దర్యాప్తునకు ఆదేశించారు. ఈ నిర్ణయాలను నిశితంగా గమనిస్తే ప్రజల వి శ్వాసాన్ని పొంది దాన్ని 2029 నాటి ఎన్నికల్లో బీజేపీకి ఓట్లుగా మలచుకోవాలనే ఆలోచనతో ఫడ్నవీస్ ముందుకు వెళ్తున్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది.
ఓఎస్‌డీలను నియమించుకునే అవకాశం లేదు
తమకు నచ్చిన వారిని వ్యక్తిగత కార్యదర్శులు, ఆఫీసర్స్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్‌డీ)లుగా నియమించుకునే అవకాశాన్ని సీఎం దేవేంద్రఫడ్నవీస్ తన మం త్రులకు ఇవ్వలేదు. మంత్రులకు చేతిలో పదవి ఉన్నప్పటికీ కార్యదర్శుల నియామకం, విధావిధానాల రూపకల్పన విష యాన్ని బీజేపీ చూసుకుంటుందని తన సహచరులకు సీఎం ఫడ్నవీస్ స్పష్టం చేశారట. ఇది బీజేపీ మంత్రులకూ వర్తిస్తుందని పేర్కొన్నారట.
ఈ విషయాన్ని ప్రభుత్వంలోని ఓ ఉన్నతాధికారి మీడియాకు వెల్లడించారు. ఓఎస్డీ, కార్యదర్శు ల వల్ల కొన్నిసార్లు అవినీతి మరకలు అంటే ప్రమాదం ఉన్నందున ఎలాంటి తప్పులకు ఆస్కారం లేకుండా నియామకాల విషయంలో ముందుగానే కఠినం గా వ్యవహరిస్తే ప్రభుత్వానికి ఏరకంగానూ చెడ్డపేరు రాదనే భావనలో ఫడ్నవీస్ ఉన్నారట. 2014 మధ్య కాలంలో ముఖ్యమంత్రిగా పని చేసిన ఫడ్నవీస్.. తన రెండో దఫాలో మరింత కఠినంగా వ్యవహరిస్తున్నారని ఆయన సన్నిహితులు పేర్కొంటున్నారు.