calender_icon.png 10 March, 2025 | 5:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైదరాబాద్‌లో 12 రోజులు

07-03-2025 12:00:00 AM

టాలీవుడ్ స్టార్ రామ్‌చరణ్ కథానాయకుడిగా ప్రస్తుతం ఓ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీశ్ కిలారు నిర్మిస్తున్న ఈ సినిమా ‘ఆర్‌సీ16’ అనే వర్కింగ్ టైటిల్‌తో ప్రచారంలో ఉంది. బుచ్చిబాబు సానా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా, జాన్వీకపూర్ కథానాయికగా నటిస్తోంది. గురువారం జాన్వీకపూర్ పుట్టినరోజు.

ఈ సందర్భంగా మూవీటీమ్ ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ ఓ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. అయితే, ఇది బిహైండ్ ది సీన్‌కు సంబంధించిన స్టిల్ అని,  అఫీషియల్ లుక్ కాదని, మొదటి షెడ్యూల్ సమయంలోని సాధారణ ఫోటో అని స్పష్టం చేశారు.

జాన్వీ ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేసినప్పుడు అందరూ మెస్మరైజ్ అవుతారని టీమ్ పేర్కొంటోంది. 2024, నవంబర్‌లో మైసూర్‌లో జరిగిన మొదటి షెడ్యూల్‌లో జాన్వీ పాల్గొంది. తాజాగా గురువారం కొత్త షెడ్యూల్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించింది చిత్రబృందం. ఇందులో జాన్వీ పాల్గొననుంది. 12 రోజుల పాటు కొనసాగే ఈ షెడ్యూల్ భాగంగా హీరో, హీరోయిన్, ఇతర ఆర్టిస్టులపై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.