calender_icon.png 3 March, 2025 | 3:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్వయం ఉపాధి పథకాలకు 6,000 కోట్లు

03-03-2025 01:59:26 AM

వనపర్తి నుంచే కొత్త పథకం ప్రారంభం

వనపర్తి సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

వనపర్తి, మార్చి 2 (విజయక్రాంతి): వనపర్తి నియోజకవర్గం అత్యంత రాజకీయ చైతన్యవంతమైన ప్రాంతమని, ఈ ప్రాంతం నుంచి రాష్ర్ట ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రారంభిస్తుమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు .

గత ప్రభుత్వం పదేళ్లపాటు పాలన చేసి  ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీ కార్పొరేషన్లకు ఒక్క రూపాయి నిధులు కేటాయించ లేదన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పటి ఇందిరమ్మ ప్రభుత్వాలు  అన్ని వర్గాల సంక్షే మం కోసం పని చేసిందని, కార్పొరేషన్లకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించేది అని గు ర్తు చేశారు.

దురదృష్టవశాత్తు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మాత్రం  నాటి ప్రభు త్వం కార్పొరేషన్ లకు ఒక్క రూపాయి ఇవ్వలేదని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ అమలు తర్వాత  తమ కాంగ్రెస్ ప్రభుత్వం కార్పొరేషన్లకు 6,000 కోట్ల రూపాయలను కేటాయించిందన్నారు. సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ గ్రూపులకు  ఏప్రిల్ 14న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకల లోగా 6,000 కోట్లను పంపిణీ చేస్తామని తెలిపారు. వనపర్తి నియోజకవర్గం అభివృద్ధి సంక్షేమం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2,200 జరిగిందన్నారు.

విద్యార్థి దశ నుంచి ఇక్కడి ప్రజల కష్ట సుఖాలు తెలుసుకున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి  వేల కోట్లతో అభివృద్ధి పనులను చేపట్టారు అన్నారు. సమా జంలో అత్యంత వెనుకబడిన దళితులు మైనార్టీ బీసీల గురించి నాటి బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఆలోచించలేదన్నారు.

గత ప్రభు త్వం 8 లక్షల కోట్ల భారం వేసినప్పటికిని, తమ ప్రభుత్వం ఏమాత్రం అధైర్య పడకుండా కార్యక్రమాలను కొనసాగిస్తుందని, తమ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షే మ పథకాలు  లిఖించదగిందన్నారు  తెలంగాణ అభివృద్ధి కోసం దావూస్ లో ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి  1,80,000 కోట్ల అగ్రిమెంట్లను చేసుకుని వచ్చారని గుర్తు చేశారు. తెలంగాణ అభివృద్ధిని కేసిఆర్, కేటీఆర్, హరీష్ రావులు ఎన్ని కుట్రలు చేసినా ఏ మాత్రం అడ్డుకోలేరని స్పష్టం చేశారు.