న్యూఢిల్లీ, డిసెంబర్ 3: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పీఎం ‘సూర్యఘర్’ విద్యుత్ పథకానికి విశేష స్పందన లభించింది. ఈ పథకం కోసం దేశ వ్యాప్తంగా 1.45 కోట్లకు పైగా రిజిస్ట్రేషన్లు నమోదైనట్లు కేంద్రం వెల్లడించింది. ఇప్పటికే ఈ పథకం కింద 6.34 లక్షల ఇండ్లకు ఇన్‌స్టాలేషన్ పూర్తి చేసినట్లు మంత్రి శ్రీపాద్ నాయక్ పార్లమెంటుకు తెలిపారు. ఈ పథకం కోసం ఉద్దేశించిన నేషనల్ పోర్టల్ ద్వారా వీరంతా నమోదు చేసుకున్నట్లు మంత్రి వివరించారు. 3.66 లక్షల దరఖాస్తుదా రులకు సబ్సిడీ విడుదల చేశామని పేర్కొన్నారు. గుజరాత్ రాష్ట్రంలో అత్యధికంగా 2,86,545 ఇన్‌స్టాలేషన్లు పూర్తునట్లు తెలిపారు.