ప్రయాగ్‌రాజ్ వేదికగా అత్యంత వైభవంగా జరుగుతున్న కుంభమేళా సోమవారం నాటికి 8వ రోజుకు చేరుకుంది. తీవ్రమైన చలిగాలులతో ప్రయాగ్‌రాజ్ వద్ద ప్రతికూల పరిస్థితులు ఉన్నా.. భక్తుల రద్దీ కొనసాగుతోంది. సోమవారం ఉదయం 8 గంటలకు 22 లక్షల మంది త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించగా.. మేళా ప్రారంభమైన ఈ వారం రోజుల్లో దాదాపు 8 కోట్లకు పైగా భక్తులు పవిత్ర స్నానాలు చేశారు. కాగా ఆదివారం రోజు దాదాపు 150 మంది మహిళలు నాగ సాధువులుగా దీక్ష చేపట్టారు.