10-03-2025 02:51:31 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): తెలంగాణ మలిదశ ఉద్యమంలో అత్యంత కీలకమైన ఘట్టాల్లో ఒకటైన మిలియన్ మార్చ్‌కు నేటితో 14 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. అప్పటి కాంగ్రెస్(Congress) పాలకుల ఆంక్షలకు తట్టుకొని, నిర్భంధాలకు ఎదురొడ్డి, అరెస్టులను ఎదురించి, లక్షలాది తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ట్యాంక్ బండ్‌పై గర్జించిన అపురూప సన్నివేశాలు ఇప్పటికీ కళ్ళ ముందు మెదులుతున్నాయని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో వివిధ పోరాట రూపాల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొన్న ప్రతీ ఒక్కరికీ ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలిపారు.