calender_icon.png 12 February, 2025 | 1:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజావాణికి 41 ఫిర్యాదులు

11-02-2025 12:23:40 AM

గద్వాల, ఫిబ్రవరి 10 ( విజయక్రాంతి ) : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ బి.యం. సంతోష్  అధికారులకు సూచించారు.సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో  సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 41 ఫిర్యాదులు అందాయి.

జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ తో పాటు, అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగరావు, ఆర్డీఓ శ్రీనివాసరావు, లకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు.  కాగా, అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ,  సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను సూచించారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

ప్రజావాణి అర్జీలను వేగంగా పరిష్కరించాలి: కలెక్టర్ ఆదర్శ్ సురభి

వనపర్తి టౌన్, ఫిబ్రవరి 10 : ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి స్వీకరించిన ఫిర్యాదులు, అర్జీలను వేగంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి అదనపు కలెక్టర్ రెవెన్యూ జి వెంకటేశ్వర్లు, ఆర్డీవో సుబ్రహ్మణ్యంతో కలిసి హాజరై ప్రజల నుంచి అర్జీలు, వినతులు స్వీకరించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యలకు పరిష్కారం చూపే బాధ్యత అధికారులపై ఉందన్నారు. ప్రజావాణి కార్యక్రమంలో 46 దరఖాస్తులు వచ్చాయని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు. 

ప్రజావాణికి 07 పిర్యాదులు

వనపర్తి టౌన్ పిబ్రవరి -10:  జిల్లా కేంద్రం లోని ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావా ణి కార్యక్రమం కు 7 పిర్యాదులు అందినట్లు ఎస్పీ రావుల గిరిధర్ తెలిపారు. భాధితుల సమస్యల సత్వర పరిష్కారానికి సంబంధిత అధికారులు తక్షణమే విచారణ చేపట్టి బాధితులకు న్యాయం చేకూర్చాలని ఎస్పీ ఆదేశించారు. జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల విచారణలో జాప్యం జరగకుండా వీలైనంత త్వరగా పరిష్కరించి బాధితులకు న్యాయం చేకూర్చాలని అధికారులకు ఎస్పీ  ఆదేశించారు.

ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాం 

మహబూబ్ నగర్, ఫిబ్రవరి 10  (విజయ క్రాంతి) : ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ప్రతి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఎస్పీ డి జానకి అన్నారు. సోమవారం జడ్చర్ల పిఎస్ లో ఎస్పీ ప్రజా ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మహిళల భద్రతపై పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి సారిస్తోందని, ఎవరైనా వేధింపులకు గురైతే డయల్ 100,  8712659365 జిల్లా మహిళా హెల్ప్‌లైన్ నెంబర్లను సంప్రదించాలని సూచించారు.

షి టీమ్స్, మహిళా పోలీస్ విభాగం మరింత చురుగ్గా పనిచేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.పోలీసు శాఖ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని, సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తుందని ఎస్పీ గారు స్పష్టం చేశారు.

ఎవరైనా అక్రమ కార్యకలాపాల్లో పాల్గొంటే, నేరస్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో శాంతి, భద్రతకు పోలీస్ శాఖ కట్టుబడి ఉందని తెలిపారు. ప్రజావాణికి 11 మంది ఫిర్యాదులు చేశారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జడ్చర్ల రూరల్ సీఐ నాగార్జున గౌడ్, జడ్చర్ల టౌన్ ఇన్స్పెక్టర్ ఆది రెడ్డి, ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.