calender_icon.png 29 December, 2024 | 4:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజల కోసం పోరాడేది కమ్యూనిస్టులే

02-11-2024 02:07:13 AM

 ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు 

కూసుమంచి, నవంబర్ 1 ( విజయక్రాంతి): ప్రజల కోసం నిస్వార్థ జీవితం గడిపి, జైలుకు వెళ్లింది ఒక్క కమ్యూనిస్టులేనని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. మండలంలోని బైరవునిపల్లి గ్రామంలో జరిగిన సీపీఐ మహాసభలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలకు జైలుకెళ్లిన చరిత్ర లేదన్నారు. బీజేపీ అధికారం కోసం కులాలను, మతాలను అడ్డుపెట్టుకుంటుందని విమర్శించారు. పోరాటాలు చేసే వారికి కమ్యూనిస్టులు ఆక్సిజన్‌లా ఉంటారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఆయనను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో  పార్టీ రాష్ట్ర నాయకులు భాగం హేమంతరావు, జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.