విజయక్రాంతి, నెట్‌వర్క్ సీపీఐ పురుడు పోసుకుని 100వ వసంతంలోకి అడుగిడుతున్న సందర్భంగా గురువారం రాష్ట్రవ్యాప్తంగా పార్టీ నేతలు శతాబ్ది ఉత్సవాలకు అంకుర్పారణ చేశారు. ఖమ్మం నగరంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు జిల్లా నేతలతో కలిసి భారీ ర్యాలీ చేపట్టారు. ర్యాలీలో పార్టీ జాతీయ నేత పువ్వాడ నాగేశ్వరరావు, పార్టీ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ చైర్మన్ మహ్మద్ మౌలానా తదితరులు పాల్గొన్నారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా సీపీఐ శ్రేణులు శతాబ్ది ఉత్సవాలకు సంబంధించిన వేడుకలు నిర్వహించారు.