calender_icon.png 22 April, 2025 | 9:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం అంబేద్కర్ స్మృతి వనానికి వెళ్లాలి

14-04-2025 12:32:47 AM

125 అడుగుల విగహానికి నివాళులర్పించాలి

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్

హైదరాబాద్, ఏప్రిల్ 13 (విజయక్రాంతి): హైదరాబాద్ నెక్లెస్ రోడ్‌లోని 125 అడుగుల అంబేద్కర్ విగ్రహానికి రాష్ట్ర ప్రభుత్వం నివాళులు అర్పించాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. సోమవారం అంబేద్కర్ జయంతి సందర్భంగా సీఎంతోపాటు మంత్రులు అంబేద్కర్ స్మృతి వనానికి వెళ్లి మహానీయుడికి నివాళులు అర్పించాలని ఆదివారం ఓ ప్రకటన ద్వారా సూచించారు.

అంబేద్కర్ స్ఫూర్తిని భావి తరాలకు తెలియాలని కేసీఆర్ 125 అడుగుల ఎత్తయిన విగ్రహాన్ని ఏర్పాటు చేశారని కవిత చెప్పారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగంపై ప్రమాణం చేసి, ఆయన పేరుతో నిర్మించిన సెక్రటేరియట్ ద్వారా పాలన చేస్తూ సచివాలయం పక్కనే ఉన్న 125 అడుగుల విగ్రహాన్ని గౌరవించకపోవడం సరికాదన్నారు. ఇదంతా కేసీఆర్‌పై కోపంతో చేస్తున్నారని అనుకోవాల్సి వస్తుందని కవిత చెప్పారు.