30-04-2025 05:46:44 PM
హైదరాబాద్: బసవేశ్వరుడు జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) ప్రత్యేక డైరీ, సంచికను ఆవిష్కరించారు. 12వ శతాబ్దంలోనే ప్రపంచ పరిజ్ఞానాన్ని పునికిపుచ్చుకున్నారని సీఎం కొనియాడారు. సామాజిక చైతన్యం కలిగించిన సంఘ సంస్కర్త ససవన్న అన్నారు. సమాజంలో అనేక మార్పులకు బసవన్న పునాది వేశారని చెప్పారు. పదోతరగతి మెరుగైన ఫలితాలకు ప్రభుత్వం పనితీరు నిదర్శనమన్నారు. దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే ఉందని ఆయన వివరించారు. సమూల మార్పుల కోసం నాణ్యమైన విద్య అందించాలని సీఎం పేర్కొన్నారు. సమసమాజాన్ని నిర్మించాలి.. దళితులు, గిరిజనులకు న్యాయం జరగాలని ఆయన ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ గౌరవంగా బతికేందుకు ప్రభుత్వాలు ప్రణాళికలు చేయాలని పిలుపునిచ్చారు. ప్రజల జీవనప్రమాణాలు పెంచేందుకు రాజ్యాంగం రూపకల్పన చేయాలన్నారు. ప్రభుత్వ లోపాలు ఎత్తిచూపేందుకు ప్రతిపక్ష వ్యవస్థ ఏర్పాటు చేయాలని రేవంత్ రెడ్డి సూచించారు.
బీఆర్ఎస్(Bharat Rashtra Samithi) సభ ఏర్పాటు చేసుకుంటే బస్సులు ఇవ్వాలని చెప్పామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. సభకు అవసరమైన వెసులుబాటు కల్పించాలని అధికారులను ఆదేశించామని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వంతో పాటు ప్రతిపక్షం బలంగా ఉండాలని తెలిపారు. బీఆర్ఎస్ సభకు సంపూర్ణంగా సహకరించింది నిజం కాదా.. మీ పార్టీలో వందల కోట్లు.. ఫాంహౌస్ లు ఉన్న మాట నిజం అన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయంలో ఎక్కడా మంచి కనబడలేదా.. ప్రభుత్వాన్ని భుజం తడుతూ వైఫల్యాలను ప్రశ్నించాలని సీఎం సూచించారు.
ప్రతిపక్ష నేత కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao) ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండా వసతులు అనుభవిస్తున్నారని సీఎం ఆరోపించారు. 16 నెలలుగా జీతభత్యాలు తీసుకుంటూ వసతులు అనుభవిస్తున్నారని విమర్శించారు. అసెంబ్లీకి రాను.. మా పిల్లలను పంపామని చెబుతున్నారని తెలిపారు. పిల్లలను సభకు పంపితే మీరెందుకు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు? సభకు రాని ప్రతిపక్ష నాయకుడికి మిమ్మల్ని ప్రశ్నించే నైతిక హక్కు ఉందా? రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ప్రతిపక్ష హోదా ఇచ్చిన ప్రజల వద్దకు ఎందుకు వెళ్లడం లేదన్నారు. అధికారం ఉంటే చలాయిస్తాం.. లేకపోతే ఫౌంహౌస్ లోనే ఉంటామంటున్నారని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వ పథకాలు నిలిపి వేసినట్లు చెబుతున్నారు.
రైతుబంధు ఆగిందా.. రైతు రుణమాఫీ ఆగిందా.. ప్రజా పాలన ఆగిందా అని ప్రశ్నించారు. హైదరాబాద్ విస్తరణకు అభివృద్ధి పనులు చేపడుతున్నామని సీఎం స్పష్టం చేశారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ.. కోతుల గుంపుకు అప్పగించినట్లయిందన్నారు. ప్రతిపక్ష నేత కుటుంబం తెలంగాణ మీద పడి దోచుకుని తిన్నదన్నారు. తెలంగాణ ఆగమైంది.. కాంగ్రెస్ విలన్(Congress villain) అని ఆరోపింస్తున్నారు. మరో పదేళ్లు దోచుకోవడం ఆగిందని తెలంగాణ ఆగమైందా.. తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్ విలన్ అయ్యిందా.. అన్నారు. కాళేశ్వరం, రైతురుణమాఫీ, ఎస్సీ వర్గీకరణ(SC Classification), కులగణన, రైతుబంధుపై చర్చిద్దామా? అని ముఖ్యమంత్రి సవాల్ విసిరారు.