calender_icon.png 29 April, 2025 | 2:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మావోయిస్టులతో కేంద్రం చర్చలు జరపాలి

29-04-2025 12:00:00 AM

జస్టిస్ చంద్రకుమార్, శాంతి కమిటీ సభ్యుడు జంపన్న

హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 28(విజయక్రాంతి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టు లతో చర్చలు జరపాలని హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ చంద్రకుమార్ సూచించారు. ఆపరేషన్ కగార్‌ను నిలిపేసి మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేస్తూ ఉస్మానియా యూనివర్సిటీ, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఓయూ ఆర్ట్స్ కాలేజీలో సమావేశం నిర్వహించారు. జస్టిస్ చంద్రకు మార్ మాట్లాడుతూ.. శాంతి చర్చలు జరపకుండా కేంద్రం ఆదివాసీలపై దమనకాండకు పాల్పడుతోందన్నారు. శాంతి చర్చల కమిటీ సభ్యుడు జంపన్న మాట్లాడుతూ.. ఆదివాసీల సంక్షేమానికి మావోయిస్టులు, కేంద్ర ప్రభుత్వం ఇరుపక్షాలు శాంతిని పాటించాలని కోరారు.

ఆదివాసీలను నిర్వాసితులను చేసి ఖనిజ సంపదను కార్పొరేట్ కంపెనీలకు అప్పగించేందుకు మోడీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని విద్యార్థి సంఘాలు ఆరోపించాయి. ఓయూ విద్యార్థి ప్రశాంత్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో పీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఆవుల నాగరాజు, కోట ఆనందరావు, ఏఐఎస్‌ఎఫ్ నాయకుడు ఉదయ్, డీఎస్‌ఏ నాయకుడు గణేష్, పీడీఎస్‌యూ నాయకులు ఆసిఫ్, అల్లూరి విజయ్, తదితరులు పాల్గొన్నారు.