calender_icon.png 14 April, 2025 | 12:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కుల ధృవీకరణ పత్రాలు అందజేయాలి

13-04-2025 12:00:00 AM

-మాలజంగం, మహేశ్వర్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు పర్శశ్యామ్‌రావు

ముషీరాబాద్, ఏప్రిల్ 12 (విజయక్రాంతి) : తెలంగాణ మాల జంగం మహే శ్వర్లకు కుల ధ్రువీకరణ పత్రం ఆర్డీఓతో కాకుండా ఎంఆర్‌ఓ ద్వారా ఎలాంటి షరతులు లేకుండా ఇప్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ మాల జంగం మహేశ్వర్ల సంక్షేమ సంఘం కోరింది. ప్రస్తుతం ఆర్డీవో ద్వారా అందజేయడం వలన తీవ్ర ఇబ్బందులకు గురవుతు న్నామని తెలిపింది. ఈ మేరకు శనివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో  ఏర్పాటు చేసిన మీడియా  సమావేశంలో సంఘం అధ్యక్షులు పర్స శ్యామ్ రావు, ప్రధాన కార్యదర్శి తాలూక రాజేందర్, ఉపాధ్యక్షులు నిమ్మ సదానందం, కొండ మచ్చేందర్లు మాట్లాడారు.

వేములవాడలో తమ కులానికి 2000 గజాల స్థలం కేటాయించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన ఎస్సీ వర్గీకరణ ద్వారానే తమ కులం వెలుగులోకి వచ్చిందని కానీ, వర్గీకరణలో భాగంగా తమ కులా న్ని గ్రూప్-సీ లో చేర్చి 38 నెంబర్ కేటాయించరని తెలిపారు. తమ సామాజిక వర్గంలో చాలా మంది పేదవారు ఉన్నారని, రోజు కూలీకీ వెళ్తేనే పొట్ట గడుస్తదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు పీసరి సత్యానందం, వేముగంటి నాగభూషణం, గౌడి చిరంజీవి, కోదాది భూమాయ్య, రామిల్ల గురుపాదం, యోగిశ్వర్ తదితరులు పాల్గొన్నారు.