21-04-2025 01:07:08 AM
కుమ్రం భీం ఆసిఫాబాద్,, ఏప్రిల్ 20 (విజయక్రాంతి): తెలంగాణ మోడల్ స్కూల్ లో వచ్చే విద్యా సంవత్సరానికి గాను 6 వ తరగతి నుండి పదవ తరగతి వరకు ప్రవేశాలకు సంబంధించిన ప్రవేశ పరీక్ష ఆదివారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్ లో నిర్వహించారు. మొత్తం 900 మంది విద్యార్థులకు గాను 815 మంది హాజరు కాగా 90.5 శాతం హాజరు నమోదు అయినట్లు జిల్లా పరీక్షల సహాయ కమిషనర్ ఉదయ్ బాబు తెలిపారు.
ఓపెన్ టెన్త్,ఇంటర్ పరీక్షలు ప్రారంభం
జిల్లాలో ఓపెన్ పది, ఇంటర్ పరీక్షలు ఆదివారం ప్రశాంతంగా ప్రారం భమైయ్యాయి. టెన్త్‌కు గాను మొత్తం 237 మందికి 208 మంది హాజరయ్యారు. ఇంటర్ 172 మందికి గాను 155 మంది హాజరైనట్లు జిల్లా పరీక్షల సహాయ కమిషనర్ ఉదయ్ బాబు తెలిపారు.