హన్మకొండ కలెక్టర్ ప్రావీణ్య
భీమదేవరపల్లి, నవంబర్ 30 (విజయక్రాంతి): సీఎం ఓవర్సీస్ పథకం కింద విదేశాలలో పీజీ, ఎంబీబీఎస్ చదువుకునే విద్యార్థులకు రూ.20లక్షల వరకు స్కాలర్‌షిప్ అందించనున్నట్టు హనుమకొండ కలెక్టర్ పి.ప్రావీణ్య శనివారం తెలిపారు. ఆగస్టు 1 నుంచి డిసెంబరు 31 వరకు విదేశాల్లో అడ్మిషన్ తీసుకున్న అభ్యర్థులు జిల్లా మైనారిటీ సంక్షేమ సంఘం అధికారి కార్యాలయంలో దరఖాస్తులు సమర్పిం చాలన్నారు.
విద్యార్ధుల తల్లిదండ్రుల ఆదాయం రూ.5 లక్షల లోపు ఉండాలన్నారు. ఈ పథకం కింద ఎంపికైన విద్యార్థులకు రూ.20 లక్షలు అందించడం జరుగుతుందన్నారు. విమాన చార్జీల కోసం రూ.60 వేలు అందిస్తారని చెప్పారు. దరఖాస్తులను డిసెంబర్ 31 నుంచి ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలన్నారు. మరి న్ని వివరాలను జిల్లా మైనారిటీ సంక్షేమ సంఘం అధికారిని సంప్రదించాలన్నారు.