calender_icon.png 8 April, 2025 | 7:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వరంగల్ సభకు 3 వేల బస్సులు

08-04-2025 01:42:00 AM

ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌కు రూ.8 కోట్ల చెక్ అందించిన బీఆర్‌ఎస్ నేతలు

హైదరాబాద్, ఏప్రిల్ 7 (విజయక్రాంతి): ఈనెల 27న వరంగల్‌లో తమ పార్టీ తలపెట్టిన రజతోత్సవ సభకు ప్రజలను తరలించేం దుకు ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేయాలని కోరుతూ బీఆర్‌ఎస్ నేతలు సోమవారం తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు.

వివిధ ప్రాంతాల నుంచి పెద్దఎత్తున ప్రజలు వస్తున్నారని, వారి కోసం తమకు 3 వేల బస్సులు అవసరమవుతాయని సజ్జనార్ దృష్టికి తీసుకెళ్లారు. బస్సుల ఏర్పాటుకు అవసరమయ్యే రూ.8 కోట్ల చెక్‌ను ఎండీకి అందజేశారు. సజ్జనార్‌ను కలిసిన వారిలో బీఆర్‌ఎస్ సీనియర్‌నేత రావుల చంద్రశేఖర్‌రెడ్డి, గెల్లు శ్రీనివాస్‌యాదవ్, తుంగా బాలు, విజయకుమార్ ఉన్నారు.