calender_icon.png 7 January, 2025 | 11:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ భవన్‌కు కేటీఆర్

06-01-2025 11:10:38 AM

హైదరాబాద్: బంజారాహిల్స్ లోని ఏసీబీ ప్రధాన కార్యాలయం నుంచి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) వెళ్లిపోయారు. లాయర్లను లోపలకు అనుమతించకపోవడంతో కేటీఆర్ వెనుదిరిగారు. 40 నిమిషాల పాటు పోలీసులు, కేటీఆర్ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. లాయర్ ను అనుమతించాలని కోర్టు ఉత్తర్వుల్లో లేదని పోలీసులు తెలిపారు. లాయర్ ను అనుమతించకూడదన్న నిబంధన చూపాలని కేటీఆర్(KTR) పట్టుబట్టారు. పోలీసుల తీరును నిరసిస్తూ విచారణకు హాజరుకాకుండానే ఏసీబీ కార్యాలయం నుంచి కేటీఆర్ నేరుగా తెలంగాణ భవన్ కు వెళ్లారు. తన స్పందనను రాతపూర్వకంగా ఇచ్చి తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. ఫార్ములా-ఈ రేస్(Formula-e race) అంశంలో ఏసీబీ నోటీసులపై కేటీఆర్ స్పందించారు. హైకోర్టుతీర్పు తర్వాత చట్టప్రకారం ముందుకెళ్లాలని కేటీఆర్ సూచించారు. రోడ్డుపైనే తన స్పందనను కేటీఆర్ ఏసీబీ అధికారులకు అందజేశారు.