calender_icon.png 6 March, 2025 | 9:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

9 ఏండ్ల బాలుడిపై సవతి తల్లి వేధింపులు

06-03-2025 12:55:02 AM

 పోలీసులను ఆశ్రయించిన బాలుడు

పెబ్బేరు, మార్చి 5: కానరాని లోకాని వెళ్లిన కన్న తల్లి ప్రేమకు దూరమై 9ఏండ్ల బాలుడు సవతి తల్లి వేధింపులు వర్ణణాతీతం. ఆ బాలుడు అనుభవించిన నరక యాతన గోస విన్న పోలీసుల హృదయాలను కలిచివేసింది. ఈ సంఘటన వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం సుగూరు గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ బాలుడిని అక్కున చేర్చుకొని భద్రతకు భరోసా కల్పించారు. వివరాలలోకి పొతే పెబ్బేరు మండలంలోని సుగూరు గ్రామానికి చెందిన గొల్ల నరసింహా, వనిత దంపతులకు జన్మించాడు బాలుడు. గత రెండేళ్ల క్రితం బాలుడి కన్న వనిత అనారోగ్యంతో మృతి చెందింది. పెద్దల సహకారం తో నరసింహా సమీప బంధువైన లక్ష్మిని రెండవ పెళ్లి చేసుకున్నాడు.

పెళ్ళున కొత్తలో సవతి తల్లి బాలుడిని ప్రేమగా చూసుకుంటుంది. గడిచిన కొంత కాలంలో బాలుడిపై కక్ష సాధింపు చర్యలకు తరచూపాలుపడేది. ఏదో ఒక సాకుతో బాలుడిని శారీరకంగా హింసిస్తూ నరక యాతన చూపడం మొదలుపెట్టింది. ఎవరు లేని సమయంలో చీటికీ మాటికీ తిడుతూ నిప్పులో కాల్చిన సలాకితో తొడలపై వాతలు పెట్టేది. సవతి తల్లి పెట్టే చిత్రహీంసలను బాలుడు తన తండ్రితో మోరపెట్టుకున్న ఆమెకు అడ్డుకట్ట వేయలేకపోయాడు.

మంగళవారం ఆమె ఆకారణం గా బాలుడిని చితకబాదిన విషయాన్ని తన మేనమామ రామచంద్రయ్యకు ఫోన్ ద్వారా గోడును వెళ్ళబోసుకున్నాడు. బాలుడిని తీసుకోని మేనమామ జిల్లా పోలీస్ కార్యాలయానికి చేరుకొని జిల్లా ఎస్పీకి జరిగిన సం ఘటన వివరించారు. చిత్రహీంసలను అనుభవించిన పసి హృదయం దెబ్బలను గుర్తుకు తెచ్చుకొని ఏడుస్తున్న బాలుడిని ఎస్పీ ఓదార్చి తన నివాసంలో భోజనం పె ట్టాడు. అనంతరం బాలుడిని జిల్లా రూరల్ డెవలప్మెంట్ సొసైటీ అధికారి , జిల్లా బాలల పరిరక్షణ అధికారి, భరోసా కేంద్రం కోఆర్డినేటర్లు మనోవేదన, చిత్రహింసల వివరాలను సేకరించారు. వారి నివేదిక ఆధారంగా పెబ్బే రు పోలీస్ స్టేషన్‌లో నిందితురాలిపై కేసు నమోదు చేశారు. బాలుడిని చైతన్యపర్చి ఏదే ని పాఠశాలలో చేర్పించి బంగారు భవిష్యత్తు కు కోసం కృషి చేస్తున్న జిల్లా ఎస్పీ రావుల గిరిధర్‌ను పలువురు అభినందించారు.