06-03-2025 12:00:00 AM
ఎంపీ, ఎమ్మెల్యేల సమక్షంలో భారీగా చేరికలు
ఆదిలాబాద్, మార్చ్ 5 (విజయక్రాంతి) : ఆదిలాబాద్ జిల్లాలోని క్షేత్రస్థాయిలో బీజేపీ పార్టీకి రోజురోజుకు మరింత ఆదరణ పెరుగుతోందని ఎంపీ గోడం నగేష్ అన్నారు. సాత్నాల మండలం లోని సైద్పూర్ గ్రామంలో బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్ తో కలిసి ఎంపీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల మాజీ సర్పంచ్ లు, ఉప సర్పంచ్ లు, వార్డ్ మెంబర్స్, ఆదివాసీ సంఘాల అధ్యక్షులు, వివిధ సంఘాల నాయకులు ఎంపీ, ఎమ్మెల్యే ల సమక్షంలో బీజేపీ పార్టీ లో చేరారు.
వారికి బీజేపీ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎంపీ, ఎమ్మెల్యే లు మాట్లాడుతూ రైతుల సమస్య ల కోసం ఎల్లవేళలా పని చేస్తున్న బీజేపీ అసెంబ్లీ లో రైతుల సమస్యల గురించి ప్రభుత్వాన్ని నిలదీయడం జరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి క్రమం తప్పకుండ వస్తున్న, కానీ ఈ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు రైతు భరోసా ఇవ్వలేదని, రుణమాఫీ పూర్తి చేయలేదన్నారు. అన్ని పథకాలు తుంగలో తొక్కిందని గుర్తు చేశారు.