హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతుల కష్టాలను పట్టించుకోవడం లేదని బీజేపీ ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ప్రశ్నించారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వలేదని ఆరోపించారు. ధాన్యం కొనుగోళ్లు జరగక రైతులు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని చోట్లా ఇంకా కొనుగోలు కేంద్రాలే ఏర్పాటు చేయలని దుయ్యబట్టారు. రైతు రుణమాఫీ అమలుపై సీఎంకు ఇంకా స్పష్టత రాలేదని మండిపడ్డారు. రైతు సమస్యలపై అభిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా అవలంబిస్తున్న విధానాలకు నిరసనగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ నేతలు, రైతులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నారు.