వేడుకలలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ మరియు విమలక్క
హుస్నాబాద్ (విజయక్రాంతి): సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో బహుజన బతుకమ్మ వేడుకల్లో అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్కతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ సతీ సమేతంగా పాల్గొన్నారు. వేదికపై విమలక్క పాటకు మంత్రి పొన్నం స్టెప్పులు వేశారు. తెలంగాణ రాష్ట్ర మహిళా సోదరీమణులకు ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. సంస్కృతి సాంప్రదాయాలను కాపాడే బతుకమ్మను మహిళలు పెద్ద ఎత్తున జరుపుకోవడం మన సాంప్రదాయమని పేర్కొన్నారు. పాడి పంటలను చల్లగా చూడాలని బతుకమ్మను మొక్కుకున్నట్లు వెల్లడించారు.