calender_icon.png 1 April, 2025 | 9:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన పెంచుకోవాలి

29-03-2025 08:55:49 PM

తహశీల్దార్ లాలూ నాయక్

పెన్ పహాడ్: ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన పెంచుకొని తమ నడవడి పెంపొందించుకోవాలని తహశీల్దార్ లాలు నాయక్(Tahsildar Lalu Nayak) పేర్కొన్నారు. శనివారం సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలం నారాయణ గూడెంలో ఏర్పాటు చేసిన పౌర హక్కుల దినోత్సవం(Civil Rights Day) కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా పౌరుల ప్రాథమిక హక్కులు, మహిళల  చట్టాలు, పోలీస్, రెవిన్యూ, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ, ఫోక్సో తదితర చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ రంజిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.