calender_icon.png 13 March, 2025 | 5:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధూమపానం చేస్తున్నారా..!

09-03-2025 12:00:00 AM

ధూమపాన వ్యసనం అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఈ అలవాటు నుంచి బయటపడాలంటే మాత్రం స్వీయ నియంత్రణ చాలా అవసరం. నికోటిన్ గమ్, నాసల్ స్ప్రేలు, నికోటిన్ రీప్లేస్‌మెంట్ థెరపీలు ఈ వ్యసనాన్ని అధిగమించేందుకు సహకరిస్తాయి. ధూమపానం తీవ్రమైనప్పుడు అనేక ఆరోగ్య సమస్యలు కూడా తప్పవు.

ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బందులు తలెత్తవచ్చు.

చర్మంలో వేగంగా వృద్ధాప్య ఛాయలు కనిపిస్తాయి.

మధుమేహం, బోలు ఎముకల వ్యాధి, ఆర్థరైటిస్ సమస్యలు ఎక్కువగా ఉంటాయి.

కంటి శుక్లం, మచ్చలు, డ్రై ఐ సిండ్రోమ్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.

దంత క్షయం, నోటి దుర్వాసన, దంత నష్టం, నోటి క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.