25-03-2025 12:42:09 AM
కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్
సూర్యాపేట, మార్చి24(విజయక్రాంతి): ప్రజావాణిలో భూ సమస్యలకి సంబంధించి 22 దరఖాస్తులు, డిఆర్‌డిఎకి 9 దరఖాస్తు లు, పంచాయతీరాజ్ శాఖకి 6, 21 దరఖాస్తులు వివిధ శాఖ లకి సంబందించి మొత్తం 58 దరఖాస్తులు వచ్చాయని తదుపరి పరిశీలనకై అర్జీలను సంబంధిత అధికారులకి అందజేశామని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు.
ఈ సందర్బంగా అధికారులతో మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకా లు చివరి వ్యక్తి వరకు అందేలా అధికారులు నిరంతరం కృషిచేయాలన్నారు. ప్రపంచ క్షయ దినోత్సవం సందర్బంగా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
మండలానికో మాడల్ అంగన్వాడీ
ప్రతి మండలంలో ఒక మోడల్ అంగన్వాడీ కేంద్రా న్ని ఏర్పాటు చేయాలని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవర్ తెలిపారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్లో మహిళ, శిశు, దివ్యాంగుల వయోవృద్దుల శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ని ప్రతి మండలంలో ఒక మోడల్ అంగన్వాడి కేంద్రం ఏర్పాటుకు అన్ని చర్యలు తీసుకోవాలని తెలిపారు.
అంగన్వాడీ కేంద్రాలలో పిల్లలకు ప్రత్యేక నూతన ఫ్రీ స్కూల్ సిలబస్ ప్రకారం చెబుతున్నారా లేదా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. సిడిపిఓలు చేయవలసిన సంక్షేమ, విమెన్ వెల్ఫేర్ పై పలు సూచనలు చేశారు. అంగన్వాడీ కేంద్రాలలో టాయిలెట్స్, డ్రింకింగ్ వాటర్, రిపేర్లు తొందరగా పూర్తి చేయాలని ఆదేశించారు.