calender_icon.png 4 March, 2025 | 10:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజావాణికి 24 దరఖాస్తులు

04-03-2025 01:14:37 AM

స్వీకరించిన అదనపు కలెక్టర్ నగేష్

మెదక్, మార్చి 3(విజయక్రాంతి): జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి మొత్తం 24 దరఖాస్తులు వచ్చాయి. కార్యక్రమానికి అదనపు కలెక్టర్ నగేష్  హాజరై ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులు నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జెడ్పి సీఈఓ ఎల్లయ్య, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.