హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 3 (విజయక్రాంతి): హైదరాబాద్ కలెక్టరేట్‌లో సో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి భారీ సంఖ్యలో ప్రజలు వచ్చి దర సమర్పించారు. మొత్తంగా 1,975 దరఖాస్తులు అందాయని అదనపు కలెక్టర్లు కదిరవన్ పలాని, ముకుందరెడ్డి తెలిపారు. అత్యధికంగా గృహ నిర్మాణ శాఖకు 1,279, రేషన్ కార్డుల కోసం 563 తదితర దరఖాస్తులు అందాయని పేర్కొన్నారు.
అర్జీలను పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని సం జిల్లా అధికారులను వారు ఆదేశించారు. కార్యక్రమంలో డిఆర్‌వో ఈ.వెం ఆర్డీవో సాయిరాం, జిల్లా అధికారులు ఆర్ రోహిణి, జీ ఆశన్న, పవన్ కుమార్, కోటాజీ, డీఎంహెచ్‌వో వెంకటి, సుబ్రహ్మణ్యం, ఇలియాజ్ అహ్మద్, రాజేందర్, శ్రీరామ్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.