12-04-2025 06:21:02 PM
ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు..
బూర్గంపాడు (విజయక్రాంతి): అన్ని వర్గాల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. శనివారం మండలంలోని కృష్ణసాగర్, లక్ష్మీపురం గ్రామాల్లో సుమారు రూ 25 లక్షల ఐటిసి సిఎస్ఆర్ నిధులతో నిర్మించిన నూతన బస్ షెల్టర్, అంగన్వాడి కేంద్రాన్ని ఎమ్మెల్యే రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం అంగన్వాడి పరిసర ప్రాంతంలో ఉన్న ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి స్టాఫ్ నర్స్ లతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో జమలారెడ్డి, సిడిపిఓ రేవతి, ఐటిసి అడ్మినిస్ట్రేటివ్ చంగల్ రావు, సెక్రటరీ బాలయ్య, మాజీ సొసైటీ చైర్మన్ పోతిరెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి, మండల అధ్యక్షులు కృష్ణారెడ్డి, మాజీ ఉప సర్పంచ్ పోతిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి, టిఎన్టియూసి నాయకులు హరిప్రసాద్, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు నాగమణి, బోడ దివ్య, నాయకులు మహమ్మద్ ఖాన్, కైపు శ్రీనివాసరెడ్డి, భజన సతీష్, ప్రసాద్, బిజ్జం వెంకటేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.