ఫలక్‌నుమా పీఎస్‌లో కేసు నమోదు
చార్మినార్, నవంబర్ 17: రోడ్డుపై జరిగిన చిన్న యాక్సిడెంట్ ఇద్దరి మధ్య గొడవకు దారితీసింది. ఫలక్‌నుమా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫలక్‌నుమా కామాటిపురలోని వజీర్ అలీ మసీదు వద్ద వాహబ్ శనివారం రాత్రి 9గంటల సమయంలో కారులో ప్రయాణిస్తుండగా అదే సమయంలో ఓ యువకుడు బైక్‌తో వచ్చి వహబ్ కారును ఢీకొట్టాడు. ఇదే సమయంలో రోడ్డుపై వెళ్తున్న ఓ వ్యక్తి కాలుకి తీవ్ర గాయం అయ్యింది.
ఆ తర్వాత ఆ యువకుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే గాయపడిన వ్యక్తికి చికిత్స చేయించిన వాహబ్ ఆ తర్వాత జరిగిన విషయాన్ని అతని సన్నిహితుడైన కాలాపత్తర్ రౌడిషీటర్ అసద్ దృష్టికి తీసుకెళ్లాడు. యాక్సిడెంట్ చేసిన యువకుడు సంజయ్‌రెడ్డి నగర్‌కు చెందిన గప్ఫార్‌గా అని తెలసుకున్న అసద్.. పక్కా ప్లాన ప్రకారం ముందుగా గఫార్‌కు ఫోన్ చేసి తనను తాను పరిచయం చేసుకున్నాడు.
ఆ తర్వాత గఫార్‌ను తిట్టడంతో ఇద్దరి మధ్య మాటమాట పెరిగింది. దీంతో కోపోద్రిక్తుడైన అసద్ నీ అడ్రస్ చెప్పు నీ ఇంటికి వస్తాను అని అనడంతో గఫార్ తన అడ్రస్ చెప్పాడు. ఆదివారం తెల్లవారుజామున నలుగురు వ్యక్తులతో గఫార్ ఇంటికి వచ్చిన అసద్ ఒక్కసారిగా అతనిపై దాడి చేశాడు.
ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన గఫార్ ఫలక్‌నుమా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు అసద్‌పై హత్యాయత్నం కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.