14-04-2025 12:00:00 AM
ఎర్రోళ్ల శ్రీనివాస్, మేడే రాజీవ్‌సాగర్
హైదరాబాద్, ఏప్రిల్ 13 (విజయక్రాంతి): అంబేద్కర్ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అవలంభిస్తున్న తీరు సరిగా లేదని ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ విమర్శించారు. నెక్లెస్ రోడ్‌లోని 125 అడుగుల అంబేద్కర్ విగ్ర హానికి గతేడాది ఎన్నికల కోడ్ ఉం దని నివాళులు అర్పించలేదని, ఇ ప్పుడు విగ్రహ ప్రాంగణ తాళాలు తీయడం లేదని మండిపడ్డారు. ఆదివారం హైదారాబాద్‌లోని తెలంగా ణ భవన్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. కేసీఆర్‌పై కోపంతో ప్రాంగణ తాళాలు తీయడం లేదన్నారు.
అంబేద్కర్ విగ్రహ ప్రాంగణ గేట్ల తాళాలు తీయకుంటే అంబేద్కర్ వాదులు ఉద్యమానికి సిద్ధం అవుతారన్నారు. ప్రభుత్వం కళ్లు తెరవకుంటే తామే చీపుర్లతో ప్రాంగణాన్ని శు భ్రం చేస్తామని ఫుడ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మేడే రాజీవ్‌సాగర్ అన్నారు. అంబేద్కర్ విగ్రహానికి సీ ఎం పూలదండ వేయాలని డిమాం డ్ చేశారు.సమావేశంలో మన్నె గోవర్ధన్‌రెడ్డి, గోసుల శ్రీనివాసయాదవ్ ఉన్నారు.