15-04-2025 01:03:57 AM
ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అంబేద్కర్ కు ఘన నివాళి
ఖమ్మం, ఏప్రిల్ 14 ( విజయక్రాంతి ):- బీఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు సోమవారం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా కాంగ్రెస్, బీజేపీ, తదితర పార్టీలు, వివిధ సంఘాల నేతలు, కార్యకర్తలు ఖమ్మం జిల్లా పరిషత్ సెంటర్ లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి, ఘనంగా నివాళులు అర్పించి, దేశానికి అయన చేసిన సేవలను కొనియాడారు.రఘునాథపాలెం మండలం ఈర్లపూడి లో మంత్రి తుమ్మల నాగేశ్వరావు అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించి, పూలమాల వేసి, నివాళులు అర్పించారు.
ఈ సందర్బంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ అంబేద్కర్ ప్రజల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడని కొనియాడారు. కుల వివక్షతను అంతం చేయడానికి ‘విద్య - ఉద్యమించు - సంఘటితం ‘ అనే నినాదంతో సామజిక ఉద్యమాన్ని నిరంతరం కృషి చేశారని అన్నారు.జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమం లో ఎంపీ రామసహాయం రఘురామిరెడ్డి, డిసిసి అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా ఎంపీ మాట్లాడుతూ రాజ్యాంగ పరిరక్షణ కాంగ్రెస్ తోనే సాధ్యమని అంబేద్కర్ సేవలను కొనియాడి నివాళులు అర్పించారు.జిల్లా పరిషత్ సెంటర్ లోని అంబేద్కర్ విగ్రహానికి జిల్లా అదనపు కలెక్టర్లు డాక్టర్ పి. శ్రీజ, పి. శ్రీనివాస రెడ్డి పూల మాల వేసి, నివాళులర్పిం చారు. ఖమ్మం లోని తెలంగాణా భవన్ లో బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమం లో మాజీ ఎంపీ నామ నాగేశ్వరావు, మాజీ ఎమ్మెల్యే లు కందాల ఉపేం దర్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, కొండబాల కోటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నా రు. సామాజిక న్యాయం కోసం అంబేద్కర్ చూపిన మార్గంలో నడవాలని అన్నారు.
ఖమ్మం లోని రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి క్యాంపు కార్యాలయం లో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. క్యాంపు కార్యాలయం ఇంచా ర్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. ఖమ్మం భక్త రామదాసు కళాక్షేత్రంలో జరిగిన కార్యక్రమం లో నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగళి శ్రీ పాల్ రెడ్డి పాల్గొని, ఘనంగా నివాళులర్పించారు.
ఖమ్మం లోని రక్ష బుద్ధ రిసారట్స్ లో డాక్టర్ గోంగూర వెంకటేశ్వర్లు నేత్రుత్వంలో అంబేద్కర్ చిత్ర పటానికి పూల మాల వేసి, ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా బీజేపి జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు మాట్లాడుతూ తమ పార్టీ అంబేద్కర్ ఆశయాలను జనాల్లోకి తీసుకెలుతుండంతో ప్రజలు బ్రహ్మరధం పడుతున్నా రని అన్నారు. కార్యక్రమం లో ప్రముఖ సీనియర్ వైద్యులు డాక్టర్ గోంగూర వెంకటే శ్వర్లు, సన్నే ఉదయ్ ప్రతాప్, దేవకి వాసుదేవరావు, తదితరులు పాల్గొన్నారు.
సీపియం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరావు ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ సెంటర్ లో అంబేద్క ర్ విగ్రహానికి పూల మాలలు వేసి, నివాళులు అర్పించి, అంబేద్కర్ చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమం లో ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు బండి రమేష్, వై. విక్రమ్, మాదిని రమేష్, చింతలచెరువు కోటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.
ఖమ్మం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణం లోని అంబేద్కర్ సార్వత్రిక విశ్వ విద్యాలయం ప్రాంతీయ అధ్యయన కేంద్రం కో ఆర్డినేటర్ డాక్టర్ వీరన్న ఆధ్వర్యంలో ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు .అంబేద్కర్ సెంటర్ లో సీపీఐ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమం లో ఆ పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి దండి సురేష్, జమ్ముల జితేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.కూ సుమంచి, కల్లూరు, వైరా మండలాల్లో కూడా పెద్ద ఎత్తున అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించి, అయన చేసిన సేవలను కొనియాడి, నివాళులు అర్పించారు.
ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు.
కూసుమంచి , ఏప్రిల్ 14: కూసుమంచి మండల కేంద్రంలోనీ మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి(134) వేడుకలు ఘనంగా నిర్వహించారు.. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి రెడ్డి శ్రీనివాస్ రెడ్డి క్యాం పు కార్యాలయ ఇన్చార్జి పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.. అనంతరం కేక్ కట్ చేసి అయన సేవలను కొనియాడారు. ఈ దేశంలోని అన్ని వర్గాల కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎంతో కృషి చేశారని ఆయన ఆశయాలను కొనసాగించాలని కోరారు..ఈ కార్యక్రమంలో కూసుమంచి క్యాంపు నేలకొండప ల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ వెన్నపూసల సీతారాములు సిడిసి చైర్మన్ ఎర్రబోలు సూర్యనారాయణ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు మంకెన వాసు, మాదాసు ఉపేందర్ , బజ్జూరు వెంకటరెడ్డి కంచర్ల జీవన్ రెడ్డి, మట్టే గురవయ్య ,మోదుగు వీరభద్రం భారీ వీరభద్రం, ఏఎంసీ డైరెక్టర్స్ సుధీర్ రెడ్డి ,మొక్క ఉపేందర్ గౌడ్, దామోదర్ రెడ్డి , చాట్ల పరశురాం ,రాంకుమార్ ,జనార్దన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
కూసుమంచి మండల కేంద్రంలో
డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ 134 వ జయంతి సందర్భంగా బీజేపీ నాయకుడు గుండా ఉపేందర్ రెడ్డి ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయ న మాట్లాడుతూ.. ప్రపంచంలో అత్యున్నత దృఢమైన రాజ్యాంగము తయారు చేసి, భారత దేశంను ప్రపంచ పటంలో అత్యంత శక్తివంతమైన దేశంగా తీర్చిదిద్దారు.ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు వడ్డెంపూడి నరేష్, మంద చంద్రశేఖర్ గౌడ్, బద్దం వెంకటరెడ్డి, పిట్టల వేణు, ఆడేపు మధు, పట్టాభి తదితర నాయకులు పాల్గొని నివాళులు అర్పించారు..
బాబాసాహెబ్ అంబేద్కర్ దారిలో నడవాలి‘ కలెక్టర్ జితేష్.వి.పాటిల్
భద్రాద్రి కొత్తగూడెం ఏప్రిల్ 14(విజయ క్రాంతి): భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించా రు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల కేంద్రాలతో పాటు, మండల కేంద్రాల్లోనూ ప్రభు త్వ శాఖ అధికారులు, రాజకీయ నాయకులు, కుల సంఘాల ఆధ్వర్యంలో ఆ మహా నీయుని జయంతి వేడుకలను పండుగల నిర్వహించారు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని పోస్ట్ ఆఫీస్ అంబేద్కర్ సెంటర్ లో బాబాసాహెబ్ డా.బి.ఆర్. అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు .
జయంతి వేడుకలకు మారపాక రమేష్ కన్వీనర్ గా వ్యవహరించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ జితేష్.వి.పాటిల్ పాల్గొని మాట్లాడుతూబాబాసాహెబ్ అంబేద్కర్ హ క్కుల లేని సమాజంలో హక్కులు కల్పించిన మహాత్ముడు.ఆయన దారి అనుసరించాలం టే బిడ్డల చదువు కోసం పోరాడాలి. మనందరం సమానత్వంతో,గౌరవంగా బ్రతకడాని కి ఆయన రాజ్యాంగాన్ని రూపకల్పన చేశా రు. ప్రతి పౌరుడు ఆయన స్ఫూర్తిని తీసుకుని ముందుకు సాగాలన్నారు. జిల్లా ఎస్పి రోహిత్ రాజ్ మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలు నిజమైన మార్గదర్శకాలు. ఆయన కోసం మాట్లాడాలంటే విద్య కోసం మాట్లాడాలి.
అంబేద్కర్ ఆలోచనలు,మాటలు నాకు దారి చూపాయి. నేడు నేను ఈ పదవిలో ఉండగలిగిన దానికి కా రణం ఆయన చూపిన మార్గమే అని పేర్కొన్నారు. అతిథిగా హాజరైన కొత్తగూడెం శాస నసభ సభ్యులు,సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మాట్లాడు తూ బావితరాలకు మార్గదర్శకుడైన అంబేద్కర్ ఆశయాల సాధనకోసం ప్రతిఒక్కరు కృషి చేయాలని, ఆయన ఆశయాలకు అనుగుణగా కుల వ్యవస్థను నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని,రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లను పకడ్బందీగా అమ లు చేసేందుకు ప్రభుత్వాలపై పోరాడాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ జాయింట్ కలెక్టర్ విద్యా చందన,ఎస్సీ అభివృద్ధి అధికారి అనసూర్య,అంబేద్కర్ జయంతి కన్వీనర్ మారపాక రమేష్ కుమా ర్,జే.బీ.శౌరి,మద్దెల శివకుమార్,కూసపాటి శ్రీనివాస్,న్యాయవాది యెర్రా కామేష్, మం ద హనుమంతు తదితరులు పాల్గొన్నారు.
కల్లూరు లో అంబేద్కర్ జయంతి వేడుకలు
కల్లూరు, ఏప్రిల్ 14 :-కల్లూరు మండలం లోని మెయిన్ రోడ్డు సెంటర్ లో డాక్టర్ బాబా సాహెబ్ అంబెడ్కర్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.అనంతరం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జై భీమ్ జై బాబు జై సన్నిధానం ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమం లో కల్లూరు మార్కె ట్ చైర్మన్ బాగం నీరజ ప్రభాకర్ చౌదరి తదితరులు పాల్గొన్నారు.
మేజర్ గ్రామం పంచాయితీ కార్యాలయం లో యూత్ కాంగ్రెస్ నాయకులు యాసా శ్రీకాంత్, రాంబాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమం లో గ్రామ పంచాయితీ పారిశుధ్య కార్మికులను, విద్యుత్ శాఖ సిబ్బంది ని సన్మాన కార్యక్రమం జరిగింది.రెవిన్యూ డివిజనల్ అధికారి రాజేందర్ గౌడ్, ఎంపీడీఓ చంద్రశేఖర్పాల్గొన్నారు. ఈ సందర్బంగా రెవిన్యూ డివిజన్ అధికారి మాట్లాడుతూ ఆర్థిక వేత్త, రాజనీతిజ్ఞుడు, భారత రాజ్యాంగ రూపకర్త, ఈ శతాబ్దపు మహామేధావి డాక్టర్ బి ఆర్ అంబెడ్కర్ అని అన్నారు.
ఎంపీడీఓ చంద్రశేఖర్ మాట్లాడుతూకోట్లాది బ్రతుకులకు భరోసా చాంపియన్ ఆఫ్ ది సోషల్ జస్టిస్ భారతరత్న డా. బీఆర్ అంబేద్కర్ అని అన్నారు.మార్కెట్ చైర్మన్ నీరజ ప్రభాకర్ చౌదరి మాట్లాడుతూ డాక్టర్ బీర్ అంబెడ్కర్ ఒక్క వెనకబడిన తరగతి వారికే కాదు యావత్ దేశానికీ దిశా నిర్దేశకులుగా ఉన్నారని అన్నారు..
ఈ కార్యక్రమం లో డాక్టర్ బీర్ అంబెడ్కర్ కమిటీ, మానవ హక్కులు సంఘం, మైనారిటీ సంఘాలు,బీసీ సంఘా లు,యం.ఆర్.పి.యస్ సంఘాలు నాయకులు రామకృష్ణ, ఎంగల వెంకటేశ్వర్లు, నల్లగట్ల కోటేశ్వరరావు,జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు పసుమర్తి చందర్ రావు,మం డలం కాంగ్రెస్ నాయకులు ఏనుగు సత్యం బాబు, బాగం ప్రభాకర్ చౌదరి, పాపబత్తిని నగేష్, దామల రాజు, భైర్ల కాంతారావు,ఆళ్లకుంట నరసింహారావు,లింగనబోయిన పు ల్లారావు, పెద్దబోయిన నరసింహారావు, తోట సుబ్బారావు, బొల్లం ఉపేంద్ర,పుల్లారావు, మండలం మరియు పట్టణ కాంగ్రెస్ నాయకులు ఎస్సి, ఎస్టీ, బీసీ, మైనారిటీ ముఖ్యనాయకులు, పంచాయతీ ఈఓ నాగేశ్వరావు, విద్యుత్ అధికారులు పాల్గొన్నారు.