calender_icon.png 25 April, 2025 | 2:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంబేద్కర్ హిందూమత వ్యతిరేకికాదు

25-04-2025 01:00:10 AM

సూడో మేధావులను, నాయకులను మీడియా బహిష్కరించాలి 

మెదక్ ఎంపీ రఘునందన్‌రావు 

సిద్దిపేట, ఏప్రిల్ 24 (విజయక్రాంతి): రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ హిందూ మత వ్యతిరేకి కాదని ఆయనపై అనవసరపు ఆరోపణలు చేస్తున్న మూర్ఖులు రాజ్యాంగా న్ని పూర్తిగా చదవాలని మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు సూచించారు. పహాల్గాంలో పర్యాట కులను పేరు మతం అడుగుతూ బట్టలు విప్పి చూపించాలం టూ ఉగ్రవాదులు ప్రదర్శించిన తీరు ప్రతిపక్ష పార్టీలకు కనిపించడం లేదంటూ ప్రశ్నించారు అంబేద్కర్‌ను ఇతర మతస్తు లు మతం మారమని కోరినప్పుడు, దేశం బాగుపడాలంటే స్వదేశీ మతంతో మాత్రమే సాధ్యమవుతుందని, విదేశీ మతం తో దేశం అభివృద్ధి జరగదని, తాను బౌద్ధమతం స్వీకరించడానికి కారణం బౌద్ధం మనదేశంలోనే పుట్టిందని అంబేద్కర్ చెప్పినట్లు గుర్తు చేశారు.

గురువారం బిజెపి సిద్దిపేట జిల్లా పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో రఘునందన్ రావు మాట్లాడారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పై  సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ రకమైన సిస్టమేటిక్ క్రైమ్ చేసేందుకు దేశంలోని ప్రతిపక్ష పార్టీలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కుట్ర పన్నుతుందన్నారు. రాహుల్ గాంధీ ఎప్పుడైతే విదేశాలకు పర్యటనకు వెళుతాడో దేశంలో హింసను ప్రజ్వలింప చేసేందుకు కుట్ర జరుగుతుందన్నారు. అమెరికా ఉపాధ్యాక్షుడు దేశంలో పర్యటిస్తున్న సమయంలో దేశంలో శాంతి లేదని చెప్పేందుకు ఓ ప్రయత్నం జరుగిందని తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు.

మీ ప్రధాని నరేంద్రమోడీ చెప్పండి అని 27 మంది అమాయకులపై ముష్కరులు దాడికి పాల్పడితే నోరు మెదపని పార్టీలు, సుడో మేధావుల గురించిన హిందు సమాజం ఆలోచన చేయాల్సిన అవసరం ఉందన్నారు. సో కాల్ సూడో మేధావులను నాయకులను మీడియా సామాజికంగా బహిష్కరించాలని కోరారు. రాజ్యాంగంలో రాముడు, కృష్ణుల బొమ్మలు, భగవత్ గీత ప్రస్తావన ఉంటాయని తెల్వని ముర్ఖులు రాజ్యాంగం పుస్తకం పట్టుకొని దేశంలో హింసను ప్రేరేపించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. 

మదర్సాలపై  శ్వేత పత్రం విడుదల చేయాలి ... 

మదరసాల్లో ఎవరు ఉంటున్నారు..? వేరే రాష్ట్రాల పిల్లలను ఇక్కడి మదర్సాలకు ఎందుకు తీసుకొస్తున్నారు..? వారి కుటుంబ నేపథ్యం ఎంటీ ..? తదితర విషయాలపై సీఎం రేవంత్ రెడ్డి శ్వేత పత్రం విడుదల చేయాలని ఎంపీ రఘునందన్ రావు డిమాండ్ చేశారు.  ఈ సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షులు బైరి శంకర్ ముదిరాజ్, నాయకులు రామచంద్ర రెడ్డి, చింత సంతోష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.