calender_icon.png 17 March, 2025 | 9:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభ్యాస సామర్థ్యాలను పెంచేందుకు ఏఐ పాఠాలు!

17-03-2025 01:03:46 AM

కలెక్టర్ క్రాంతి వల్లూరు

సంగారెడ్డి, మార్చి 16 (విజయ క్రాంతి): ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థుల అభ్యాస సామర్థ్యాలను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్సీ ద్వారా విద్య బోధన చేసేందుకు శ్రీకారం చుట్టింది. ప్రాథమిక పాఠశాలలో 3,4,5 తరగతుల  విద్యార్థులకు ఏఐ ఆధారిత వెబ్ సైట్ ద్వారా  ఆన్ లైన్ తరగతులు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. సర్కారు బడుల్లో కృతిమ మేధాతో (ఏఐ) పాఠాలు బోధించేందుకు సంగారెడ్డి జిల్లాలో శ్రీకారం చుట్టారు. సంగారెడ్డి జిల్లాలోని పటాన్ చెరు మండలంలోని ముత్తంగి ప్రాథమిక పాఠశాలలో  పైలెట్ ప్రాజెక్టును జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు ప్రారంభించారు. జిల్లావ్యాప్తంగా 33 ప్రాథమిక పాఠశాలలో ఈ విద్యా బోధన చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రాథమిక విద్యను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈకే స్టెప్  అనే ఆర్గనైజర్ తో ప్రభుత్వం ఏఎక్స్‌ఎల్ ఏఐ ఆధారిత వెబ్ సైట్ ద్వారా  విద్యార్థులకు ఆన్ లైన్  తరగతులు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు . విద్యార్థులకు నాణ్యమైన విద్యాభోధన చేసేందుకు సర్కార్ ఏర్పాట్లు చేసింది. 

చదువులో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక బోధన..

ప్రాథమిక పాఠశాలలో విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థులు చదువులో  వెనుకబడితే గుర్తించి వారికి ప్రత్యేక విద్యా బోధన చేస్తారు. చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి ఏఐ ద్వారా ఆకట్టుకునేలా విద్య బోధన చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రాథమిక పాఠశాలలో 3,4,5 తరగతుల్లో చదువుకుంటున్న విద్యార్థులను గ్రూపులుగా చేసి తెలుగు, ఇంగ్లీష్, గణితం లో పాఠాలు బోధించేందుకు సిద్ధం చేశారు. ఒక్క తరగతిలో సుమారు ఒక గ్రూపులో ఐదు మంది విద్యార్థులను ఎంపిక చేసి విద్యా బోధన చేసేందుకు ప్రణాళిక చేశారు. ప్రాథమిక పాఠశాలలో 20 నిమిషాల వ్యవధిలో ఏఐ ద్వారా విద్యా బోధన చేస్తారు . విద్యార్థుల అభ్యాసన సామర్థ్యానికి అనుగుణంగా సర్లమైన పద్ధతిలో ఏఐ బోధన చేస్తుంది. విద్యార్థులకు ఉపాధ్యాయులు చెప్పే పాఠా లు ఎంతవరకు అర్థమవుతున్నాయే ,  గుర్తించేలా వెబ్ సైట్ లో సాఫ్ట్వేర్లు సిద్ధం చేశారు. విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో ఏఐ ప్రత్యేక బోధన చేస్తుంది. విద్యార్థుల అభ్యాస సామర్థ్యాన్ని పసిగడుతూ గతంతో పోలిస్తే పురో గతి ఉందా.. లేదా అని విద్యార్థుల పురోగతిని పరిశీలిస్తారు. ప్రాథమిక పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులు చదువులో వెనుకబడిన వారిపై మెరుగైన ఫలితాలు తీసుకురావడం కోసం ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమానికి  శ్రీకారం చుట్టింది. విద్యార్థులు చదువులో వెనుకబడి ఉన్న ముందు కు తీసుకపోవడం కోసం ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. 

విద్యార్థులు అక్షరాలు తప్పుగా చదివినా గుర్తుపట్టేస్తుంది..

ప్రభుత్వ పాఠశాలలో ప్రాథమిక విద్య చదువుతున్న విద్యార్థులు అక్షరాలు తప్పుగా చదివిన గుర్తించేందుకు ప్రత్యేక కార్యక్రమం చేపడుతున్నారు.  ఏఐ ద్వారా విద్యార్థు లకు విద్యాబోధన చేపట్టేందుకు ప్రతిష్టాత్మకంగా, ప్రయోగాత్మకంగా ప్రభుత్వం అమలు చేస్తుంది. ఏఐ ద్వారా భాషాతో పాటు గణితంలో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి తక్కువ సమయంలోనే విద్యార్థుల అభ్యాస సామర్ధ్యాన్ని పెంచేందుకు కృషి చేస్తుంది. ఒక విద్యార్థి అక్షరం తప్పుగా చదువుతే వెంటనే గుర్తించి ఏఐ ఆ విద్యార్థులకు సరైన పద్ధతిలో పలుమాలు ప్రాక్టీస్ చేయిస్తుంది. ప్రాథమిక విద్యలో వెనుకబడిన విద్యార్థులను తక్కువ సమయంలో అభ్యాస సామర్ధ్యాన్ని పెంచేందుకు కృషి చేస్తుంది. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు ఎక్కువగా భాషాతో పాటు గణితంలో వెనుకబడి ఉంటారు. వీటిపై ప్రత్యేక దృష్టి సారించి విద్యార్థులకు నాణ్యమైన బోధన చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది. జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో ఏఐ విద్యాబోధన పర్యవేక్షణ చేస్తున్నారు.