సిడ్బీ, కోవే ఆధ్వర్యంలో ప్రారంభం
హైదరాబాద్, జూలై 24 (విజయ క్రాంతి): పారిశ్రామిక కార్మికుల పిల్లల కోసం కాన్ఫెడరేషన్ ఆఫ్ విమెన్ ఎంటర్ ప్రెన్యూర్స్ (కోవే) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 15వ అవేక్ష డే కేర్ సెంటర్ను సిడ్బీ జనరల్ మేనేజర్ ఎస్ఆర్ మీనా బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మీనా మాట్లా డుతూ... ఇప్పటి వరకూ అవేక్ష డే కేర్ సెంటర్ల ద్వారా 250 మహిళలను ఆర్థికంగా ప్రభావితం చేశామని తెలి పారు. సిడ్బీ, కోవే భాగస్వామ్యంలో తెలంగాణ వ్యాప్తంగా 20 డే కేర్ సెంటర్లను ప్రారంభించనున్నట్టు ప్రకటించారు. అనంతరం దేశవ్యాప్తంగా అవేక్ష కేంద్రాలు ఏర్పాటు చేయాలనే ప్రణాళిక రూపొందించామని స్పష్టం చేశారు.