03-04-2025 05:17:21 PM
సర్వసభ్య సమావేశం.. నిర్ణయం..
పాల్వంచ (విజయక్రాంతి): అర్హులైన ప్రతి జర్నలిస్టుకు ఇంటి స్థలాలు సాధించేందుకు శక్తి వంచన లేకుండా పోరాటం చేస్తామని పాల్వంచ ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు అబ్బురం, లెనిన్లు స్పష్టం చేశారు. గురువారం పాల్వంచ ప్రెస్ క్లబ్లో మొదటి సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ముందుగా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు అబ్బు రామ్ నూతనంగా ఎన్నిక కైన కమిటీని వెల్లడించారు. అనంతరం కమిటీ గౌరవ అధ్యక్షులుగా ఎండి జైనుల్లాహుద్దీన్, గౌరవ సలహాదారుగా రాళ్ల బండి కృష్ణమూర్తిల పేర్లను ప్రకటించారు.
ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు అబ్బు రామ్ లెనిన్ లు మాట్లాడుతూ... అర్హులైన ప్రతి జర్నలిస్టుకు ఇళ్ల స్థలాలు పొందేలా పోరాటాలను కొనసాగిస్తామని, ఇళ్ల స్థలాల సాధన కోసం తమ కమిటీ తీవ్రంగా కృషి చేస్తుందని అన్నారు. సభ్యులందరి సహకారంతో ప్రెస్ క్లబ్ హుందాతనాన్ని పెంచే విధంగా మంచి కార్యక్రమాలను చేపడుతూ అందరి సహకారంతో ముందుకు తీసుకెళ్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు జగదీష్, సహాయ కార్యదర్శి దారా శ్రీనివాస్, కోశాధికారి వీరభద్రం, సీనియర్ పాత్రికేయులు చండ్ర నరసింహారావు, రఘు, బాలినేని సత్యనారాయణ, పవన్, రవీందర్, పుల్లారావు, నాగేశ్వరరావు, నందిరాజు, రమేష్, నజీర్, మహేష్, వెంగళరావు, సందీప్, అల్లాడ రమేష్, రజాక్, వెంకటనారాయణ, అక్బర్, మసనా శ్రీను తదితరులు పాల్గొన్నారు.